News

సిసిసి భవనానికి సీఎం నిర్ణయం


అంతర్జాతీయ స్థాయి కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ నిర్ణయించాలని కేసీఆర్ నిర్ణయించారు. బంజారాహిల్స్‌లో సిటీ పోలీస్ కమిషనరేట్ ఇచ్చిన ఎనిమిది ఎకరాల స్థలంలో నిర్మించాలని నిర్ణయం తీసుకున్నారు. అందరి అభిప్రాయాలను తీసుకుని అద్దాల భనాలను నిర్మించాలని ఆదేశించారు. హైదరాబాద్‌కు ఐకాన్ బిల్డింగ్‌గా సీసీసీ భవనం మారుతుందని కేసీఆర్ అన్నారు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న పదిహేను ప్రముఖ కంపెనీలు సిసిసి భవన నమూనాలను తయారు చేశాయి. అధికారులతో కలిసి భవన నమూనాలను సిఎం పరిశీలించారు. అందులో ఒక భవన నమూనాను సిఎం ఫైనల్ చేశారు.